ద్యుతీ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదం ఉంది: ద్యుతీ సోదరి

9:41 am, Tue, 21 May 19

భువనేశ్వర్: తాను స్వలింగ సంబంధంలో ఉన్నట్లు ప్రకటించి.. ఒడిశా స్ప్రింటర్ ద్యుతీ చంద్ సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయితో తాను డేటింగ్ చేస్తున్నట్లు.. భవిష్యత్తులో ఆమెతో కలిసి ఉండబోతున్నట్లు ద్యుతి తెలిపింది.

అంతేకాక.. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని కూడా ఆమె పేర్కొంది.  అయితే, తన ప్రేమ విషయంలో అమ్మానాన్నల నుంచి ఎలాంటి ఆక్షేపణ లేకున్నా.. సోదరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆమె వాపోయింది.

చదవండిసంచలనం: స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తైవాన్

ద్యుతీపై కుట్ర…

అయితే ద్యుతీ సోదరి ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించిన అథ్లెట్ సరస్వతి చంద్ మాత్రం.. ద్యుతీని క్రీడల నుంచి దూరం చేసేందుకు కుట్ర పన్ని ఈ ప్రేమ నాటకం ఆడుతున్నారని పేర్కొంది. ద్యుతీ ఆస్తికి, ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆమె తెలిపింది. ‘‘ఆమె(ద్యుతీ) తీసుకున్న నిర్ణయం ఆమెది కాదు.. ఆమెపై ఒత్తిడి పెంచి అలా చెప్పించారు.

ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని వాళ్లు బలవంతపెడుతున్నారు. మా ఆస్తిని కాజేయాలనే వాళ్లు ఈ పని చేస్తున్నారు. ఆస్తికి మాత్రమే కాదు.. ఆమె ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వాన్ని ద్యుతీకి భద్రత ఇవ్వాలని కోరాను’’ అని ఆమె అంది.

అంతేకాక.. క్రీడల నుంచి ద్యుతీని దూరం చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించింది. ‘‘ఆమె చిన్నపిల్లేం కాదు.. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా.. అబ్బాయిని చేసుకోవాలా అనే నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ తనకు ఉంది. కానీ, ఈ నిర్ణయం ఆమెతో బలవంతంగా చేయించారు. లేకుంటే.. పెళ్లి విషయంపై చర్చ తర్వాత జరిగేది.

ద్యుతీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకుంటున్న వాళ్లే… నిజమైన దోషులు. వాళ్లు ఆమెని క్రీడల నుంచి దృష్టి మరల్చి.. ఈ వివాదంలోకి దింపారు. ఆమె ఇప్పుడు వలలో చిక్కుకుంది. 2020 ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ మీద ఆమెని దృష్టి పెట్టనివ్వకుండా.. ఆమెని ఈ ఉచ్చులో దింపారు’’ అని సరస్వతి చెప్పింది.

ఇక పిల్లలు గొప్ప వారైతే ఆ కుటుంబం ఎంతో గర్వపడుతుందని.. అదే వాళ్లు తప్పులు చేస్తే అవమానం కూడా అదే కుటుంబం ఎదురుకుంటుందని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు ద్యుతీ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

చదవండిలక్కీ గై: ఏడాదిపాటు ఫ్రీగా కేఎఫ్‌సీ చికెన్ తినేశాడు! తర్వాత ఏమైందో తెలుసా?