పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా, ట్విట్టర్ ద్వారా ఆనందం పంచుకున్న షోయబ్

2:59 pm, Tue, 30 October 18
saniya

saniya

హైదరాబాద్: భారత్ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం ఉదయం సానియా మీర్జా పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకు ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగశిశువు.. నా భార్య ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు..’ అంటూ ట్వీట్‌ చేశాడు.

దీంతో సోషల్‌ మీడియాలో సానియా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఇరుదేశాలకు అభినందనలు..’ అంటూ అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.