యూఎస్ గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్య పరిణామం.. అర్ధంతరంగా నిష్క్రమించిన జకోవిచ్

- Advertisement -

న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి సెర్బియాకు చెందిన ప్రపంచ నంబరు వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ అర్ధాంతరంగా వైదొలిగాడు.

జకోవిచ్ కోపంతో వెనక్కి విసిరిన బంతి అక్కడ ఉన్న లైన్ అంపర్‌కు గొంతుకు బలంగా తాకింది. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు.

- Advertisement -

వెంటనే స్పందించిన టోర్నీ రెఫరీ సోరెన్ ప్రీమెల్, గ్రాండ్ స్లామ్సూపర్ వైజర్ ఆండ్రియాస్ ఎగ్లీలు జకోవిచ్‌తో దాదాపు పది నిమిషాలు చర్చలు జరిపారు.

ఈ క్రమంలో జకోవిచ్ వారిని ప్రాధేయపడినట్టు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ జకోవిచ్ మ్యాచ్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఫ్రీమెల్ ప్రకటించాడు.

జకోవిచ్ చర్య నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. నిబంధనల ప్రకారమే జొకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించినట్టు యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ పేర్కొంది.

ఈ నిర్ణయం కారణంగా జొకోవిచ్ ఇప్పటి వరకు ఈ టోర్నీలో సాధించిన ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 2,50,000 డాలర్ల నగదు ప్రోత్సాహకాన్ని కూడా కోల్పోనున్నాడు.

ఈ టోర్నీని కనుక జొకోవిచ్ గెలిచి ఉంటే 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్‌‌స్లామ్ సాధించిన ఆటగాడిగా చరిత్ర కెక్కి ఉండేవాడు.

- Advertisement -