బీజేపీ నేత జీవీఎల్‌పై బూటుతో దాడి!

2:44 pm, Thu, 18 April 19

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు చేదు అనుభవం ఎదురైంది. జీవీఎల్ నర్సింహా రావుపై ఓ వ్యక్తి షూతో దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో చోటుచేసుకుంది. దాడి ఎందుకు చేశారన్నవివరాలు తెలియాల్సి ఉంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. ఓ వ్యక్తి తన షూను ఎంపీ నర్సింహారావుపై విసిరేశాడు. దీంతో కలకలం రేగింది. అక్కడ ఉన్న మరో వ్యక్తి.. షూ విసిరిన వ్యక్తిని బయటకు తీసుకువెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఎంపీపై షూ విసిరిన వ్యక్తిని డాక్టర్ శక్తి భార్గవ్‌గా గురించారు.

అతని కాన్పూర్ నివాసి. భోపాల్ నుంచి సాధ్వి ప్రగ్యాను ఎందుకు ఎన్నికల్లో నిలబెట్టామో తెలియజేస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. సాధ్వి ప్రగ్యాతో కాంగ్రెస్‌కు సమస్య ఏముందని ఎంపీ నర్సింహారావు ఆ సమయంలో ప్రశ్నిస్తున్నారు.

కాగా, డాక్టర్ శక్తి భార్గవ్ వివరాలను పలువురు సోషల్ మీడియాలో వెతకగా…ఆయన బీజేపీ సానుభూతిపరుడేనని తేలింది. అయితే, బీజేపీ కురువృద్ధుడైన నేత అద్వానీ అనుచరుడుగా ఆయన్ను భావిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు పలు వివరాలు ఉన్నాయి.