హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు ఆరోపణలు.. సినీ నటి మాధవీలతపై కేసు నమోదు

- Advertisement -

హైదరాబాద్: బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మాధవీలత తన ఫేస్‌బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి చేసిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

- Advertisement -