సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం!

4:07 pm, Thu, 14 March 19
CBI former JD vv lakshminarayana takes sensational decision, Newsxpressonline

అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపునా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తటస్థంగానే ఉంటానని,  అయితే, ప్రజాసేవ-ఎన్జీవో కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పారు.

ఎన్నికల తర్వాతే రాజకీయ ప్రవేశం..?

కాగా, ఎన్నికల తర్వాతే రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని లక్ష్మీనారాయణ తన స్నేహితులతో చెప్పినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా టీడీపీ తరపున లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆయనతో పలువురు టీడీపీ నేతలు కూడా భేటీ కావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ.. వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు.

మరోవైపు, లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య చీకటి బంధం ఉన్నట్లు తమకు ఎప్పట్నించో అనుమానాలు ఉన్నాయని, తాజాగా ఆయన టీడీపీలో చేరతారని వార్తలు రావడంతో ఈ విషయం నిర్ధారణ అయిందంటూ వారు ధ్వజమెత్తారు.