మారుతీరావు, అమృత ప్రణయ్ కథతో.. రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

rgv-new-movie-murder-first-look-poster
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ప్రకటించారు. 

ఏడాదిన్నర క్రితం అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు పరువు హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

- Advertisement -

ఇప్పుడు ఇదే కథ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘మర్డర్’ అనే టైటిల్ ఖరారు చేసిన రామ్ గోపాల్ వర్మ ఆదివారం ‘ఫాదర్స్ డే’ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా.. ‘ఓ తండ్రి తన కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలిపే అమృత, మారుతీరావు కథతో తెరకెక్కించబోతోన్న ఈ చిత్రం హృదయాల్ని కదిలిస్తుంది. శాడ్ ఫాదర్స్ ఫిల్మ్ పోస్టర్‌ను ‘ఫాదర్స్ డే’ రోజున విడుదల చేస్తున్నా..’ అంటూ వర్మ ఓ ట్వీట్ కూడా చేశారు. 

అనురాగ్ కంచర్ల సమర్పణలో రానున్న ఈ ‘మర్డర్’ చిత్రాన్ని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 

బయోపిక్‌ల జోరు పెంచిన వర్మ…

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలువురి జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించారు. గత ఏడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అయిన శశికళ బయోపిక్‌తోపాటు.. ‘దిశ’ ఘటనపై కూడా మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వర్మ చెప్పారు. 

చదవండి: ఆ 47 రోజుల్లో ఏం జరిగింది? ప్రస్తుతానికి ట్రైలర్‌ మాత్రమే.. ఈ నెల 30న ఫుల్ మూవీ…

 

- Advertisement -