చైతూ కెరీర్‌లోనే ఇదో అరుదైన మైలురాయి

5:23 pm, Mon, 15 April 19

క్కినేని నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘మజిలీ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి నాగచైతన్య కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది.

ఈ మేరకు డైరెక్టర్ శివ నిర్వాణ.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి, చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించడంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది.

అందరి అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకుండా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించగా గోపి సుందర్ సంగీతం అందించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.