చౌకీదార్ చోర్ వివాదం: సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పిన రాహుల్…

2:44 pm, Wed, 8 May 19

ఢిల్లీ: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో చౌకీదార్(కాపలాదారు) అనే పదం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రధాని మోడీ దేశానికి చౌకీదార్‌గా ఉంటానని ఎన్నికల ప్రచార సభల్లో హోరెత్తించారు. ఆఖరికి ఆయన ట్వీటర్ ఖాతాలో కూడా తన పేరు పక్కన చౌకీదార్ అని పెట్టుకున్నారు కూడా.

ఇక మోడీకి కౌంటర్‌గా రాహుల్ గాంధీ రఫెల్ వివాదాన్ని ఉద్దేశించి చౌకీదార్ చోర్(కాపలాదారే దొంగ) నినాదాన్ని అందుకున్నారు. రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా ప్రధాని మోదీ చౌకీదార్ కాదు… చోర్ అని విమర్శలు చేస్తున్నారు.

చదవండి: దేవుడా…ఈ సర్వే ఎవరు ఊహించరు…ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

అదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానిని చోర్ అంటూ స్వయంగా సుప్రీంకోర్టే అలా చెప్పిందని ప్రజల ముందు వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

చివరికి క్షమాపణ

ఇక ఈ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టుకి ఆపాదించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ… బీజేపీ నేత మీనాక్షీ లేఖీ కేసు ఫైల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు రాహుల్‌కి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది.

అయితే వరుసగా రెండుసార్లు అఫిడవిట్లు సమర్పించిన రాహుల్ తన తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు. కానీ దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యే అవకాశాలు కనిపించడంతో చివరకు రాహుల్… మూడోసారి అఫిడవిట్ దాఖలు చేసి అందులో బేషరతు క్షమాపణ చెప్పారు.

చదవండి: మోడీపై విమర్శలు: ప్రియాంక, మమతలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుష్మా