తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన

- Advertisement -

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలోని తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌పై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. మొబైల్ షాపు యజమానులైన వీరిని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారంటూ పోలీసులు అరెస్టు చేశారు.

లాకప్‌లో ఉన్న వీరు రెండు రోజుల తేడాతో మృతి చెందారు. వీరి మృతిపై స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇది పోలీసు హత్యేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు.

కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -